Tuesday, April 17, 2012

శాకాహారమే ఆరోగ్యానికి అత్యుత్తమమం .....

భలే..భలే..శాకాహారం!
ప్రపంచంలో దుస్తులు, ఆహారం, ఆచార వ్యవహారాలు లాంటివాటిలో ఎవరి శైలి వారిదే. అందులో ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కాలం గడిచే కొద్దీ వీటిల్లోనూ మార్పులు చోటు చేసుకుంటూ వచ్చారు . ఆహారం విషయంలోనూ అలాగే జరిగింది. ఒకప్పుడు మాంసాహారంపై ఆధారపడిన మనిషి వ్యవసాయం నేర్చుకొని శాకాహారంపై దృష్టిసారించాడు. నేడు ప్రపంచ వ్యాప్తంగా కూడా శాకాహారానికి డిమాండ్గ పెరిగిపోతోంది. పలువురు వైద్యనిపుణులు సైతం శాకాహారమే ఆరోగ్యానికి అత్యుత్తమమని సూచిస్తున్నారు. పెటా లాంటి సంస్థలు శాకాహారంపై ప్రచారాన్ని ఓ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు.

18C
 
మహాత్మాగాంధీ, ఏపీజే అబ్దుల్‌ కలామ్‌, అమితాబ్‌ బచన్‌, రుక్మిణిదేవి అరుండాళ్‌, మోరార్జీ దేశాయి, అనిల్‌ కుంబ్లే, షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌, మల్లయోధుడు సుశీల్‌కుమార్‌, ఆర్‌ మాధవన్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సచిన్‌ టెండూల్కర్‌....వీరందరి మధ్య కూడా ఓ సామ్యం ఉంది. వారంతా శాకాహారులే!
Famous Vegetarians
 
ఎన్నెన్నో కారణాలు

ప్రజానీకం శాకాహారాన్ని ఇష్టపడేందుకు ఎన్నో కారణాలున్నాయి. జీవహింస ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మతపరమైన విశ్వాసాలు, జంతువుల హక్కులను గౌరవించడం, ఆరోగ్యం, రాజకీయపరమైన కారణాలు, ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఇందులో ముఖ్యమైనవి. 

వీటికి కూడా దూరం

ఎంతో మంది శాకాహారులు ప్యాకేజ్డ్‌ లేదా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కు కూడా దూరంగా ఉంటారు. వీరు కేక్‌లు, కుకీలు, చాక్‌లెట్స్‌, పుట్టగొడుగులతో తయారైనవి లాంటి వాటికి కూడా దూరంగా ఉంటారు. వాటి షెల్ఫ్‌లైఫ్‌ పెంచే ప్రక్రియలో, తయారీ ప్రక్రియలో జంతుసంబంధాలను ఉపయోగించి ఉంటారేమోనన్న భయం ఇందుకు కారణం. చీజ్‌ లాంటి వాటి తయారీలో చాలా దేశాల్లో జంతు సంబంధాలను కూడా ఉపయోగిస్తుంటారు. ఆ విషయం తెలియని వారు వాటిని ఆహారంగా వినియోగిస్తూ ఉంటారు. ఒరిస్సాలో శాకాహారులు సైతం జలపుష్పాల (చేపలు)ను ఆహారంగా స్వీకరిస్తుంటారు.

ఆరోగ్యానికి ఎంతో మేలు

అమెరికా ప్రభుత్వ విభాగాలు విడుదల చేసిన డయటరీ గైడ్‌లైన్స్‌ ఫర్‌ అమెరికన్స్‌ (2010) నివేదిక ప్రకారం మాంసాహారుల కంటే కూడా శాకాహారులే మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. శాకాహారుల్లో స్థూలకాయం తక్కువ. గుండెవ్యాధులు కలిగే అవకాశాలు కూడా తక్కువే. శాకాహారం బీపీని పెంచకుండా చూస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. బాడీ మాస్‌ ఇండెక్స్‌ కూడా తక్కువే.

ఎన్నో రకాలు

 
నిజానికి శాకాహారంలోనూ మరెన్నో ఉపతెగలు ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే...


ఓవో వెజిటేరియనిజం:
వీరు గుడ్లు తింటారు కానీ పాలు తాగరు. పాల ఉత్పాదనలు తినరు. ఇందులో కొందరు నాటుకోడిగుడ్లు తినరు. కేవలం ఫామ్‌ గుడ్లు (ఫలదీకరణ ప్రక్రియ ఉండనివి) మాత్రమే తింటారు.

లాక్టో వెజిటేరియనిజం:
వీరు పాలు, పాల ఉత్పాదనలు స్వీకరించినా, గుడ్డుకు మాత్రం దూరంగా ఉంటారు.

ఓవో-లోక్టో వెజిటేరియనిజం:
వీరు, పాలు, గుడ్లు కూడా స్వీకరిస్తారు.
ప్యూర్‌ వెజ్‌: పాలు, తేనె, గుడ్లు తినరు. జంతువులపై పరీక్షించిన ఉత్పాదనలను వాడరు. జంతువుల చర్మం తదితరాలతో తయారైన దుస్తులు, పాదరక్షలు, అలంకరణ వస్తువులు తదితరాలను ఉపయోగించరు.


రా వెజ్‌:
తాజా పండ్లు, విత్తనాలు, కూరగాయలు మాత్రమే స్వీకరిస్తారు. మరీ అవసరమైతే తప్ప వాటిని ఉడికించేందుకు కూడా ఇష్టపడరు. 

ఫ్రూటరియానిజమ్‌:
వీరు పండ్లు, విత్తనాలు, చెట్లకు హాని కలిగించకుండా సేకరించే వాటిని మాత్రమే తింటారు.

బుద్దిస్ట్‌ వెజిటేరియనిజం:
శాకాహారంలోనూ ఉల్లిగడ్డ, అల్లం లాంటి వాటికి దూరంగా ఉంటారు.

జైన్‌ వెజిటేరియనిజం:
పాలు ఆహారంగా తీసుకున్నప్పటికీ గుడ్లు, తేనె, దుంపలకు దూరంగా ఉంటారు.

No comments: